xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
జాతీయం

ఎయిమ్స్ 71వ ఇన్‌స్టిట్యూట్ డే -అనుప్రియా పటేల్

26-09-2026 10:18
ఎయిమ్స్ 71వ ఇన్‌స్టిట్యూట్ డే -అనుప్రియా పటేల్
దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు గ‌ణ‌నీయంగా విస్త‌రించాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ 71వ ఇన్‌స్టిట్యూట్ డే సందర్భంగా ఆమె ఈరోజు మాట్లాడుతూ... ఎయిమ్స్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని సంపాదించుకుందని చెప్పారు. తరువాతి తరం ఆరోగ్య సంరక్షణ నిపుణులకు మార్గనిర్దేశం చేయడంలోను, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వైద్య సంస్థలకు దిశానిర్దేశం చేయడంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఒక ప్రత్యేక బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రతి పౌరునికి అందుబాటులో సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. జీవనశైలి వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని, దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు నిరంతర పరిశోధనల ద్వారా ఎయిమ్స్ కృషి చేయాల‌ని అనుప్రియా ప‌టేల్ వ్యాఖ్యానించారు.
xPress24, Krishna District, September 25,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.