తెలంగాణ
ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
07-10-2026 10:04

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు.
రెవెన్యూ, భూ కొలతలు - దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. రెండు గ్రామాల్లో భూముల సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు.
xPress24, hyderabad, October 7,