తెలంగాణ
ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమిపై సర్వేకు సీఎం ఆదేశం
07-10-2026 14:54

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో వ్యత్యాసం ఉన్న 45 ఎకరాల భూమి గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ సర్వేలో తేలే భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీని నిర్మించి, వచ్చే జూన్ 2 నాటికి పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే వెలికట్టలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని, మల్లన్న సాగర్ నీటిని అక్రమంగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 7,