xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళాటిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళా
తెలంగాణ

ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేలా తాగునీటి సరఫరా కార్యాచరణ: మంత్రి సీతక్క

19-10-2026 09:44
ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేలా తాగునీటి సరఫరా కార్యాచరణ: మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ తాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, నవంబర్ మొదటి వారంలో కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి వేసవి కార్యాచరణ వేగవంతం చేయాలని ఆదేశించారు.
xPress24, Hyderabad, October 17, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ట్రంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఎర్రమంజిల్‌లోని గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయంలో శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నాటికి సాగునీటి అవసరాలు తీరిన తర్వాత రిజర్వాయర్లలోని ನೀటిని ప్రాధాన్యత ప్రకారం తాగునీటికే కేటాయించాలని సూచించారు. గ్రామస్థాయిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ నవంబర్ మొదటి వారంలో జిల్లా కలెక్టర్లతో కలిసి అధికారులు సమీక్షలు నిర్వహించి వేసవి కార్యాచరణను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామం, ఆవాస ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని హ్యాబిటేషన్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌ల పనులు వేగవంతం చేయాలని, ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నీటి నిల్వలు తగ్గినా సరఫరా ఆగకుండా 100 అత్యవసర పంపులను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. లీకేజీలపై కఠిన చర్యలు, అత్యవసర నిధులు పైప్‌లైన్ లీకేజీలను తక్షణమే అరికట్టాలని, రోడ్డు పనుల వల్ల పైప్‌లైన్లు దెబ్బతింటే సంబంధిత శాఖలే బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల వద్ద ఉండే అత్యవసర నిధులతో పాటు ఎస్డీఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని తెలిపారు. సింగూరు రిజర్వాయర్ పరిధిలో నీటి సరఫరాపై ఈ నెల 23న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.