తెలంగాణ
ఎల్నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. నీటిని పొదుపుగా వాడాలి: సీఎం రేవంత్రెడ్డి
16-10-2026 16:28

ఎల్నినో విపత్తును అందరం కలిసి సమైక్యంగా ఎదుర్కొందామని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. జలాశయాల్లో 460 టీఎంసీలకు గాను కేవలం 209 టీఎంసీలే ఉన్నాయని, 251 టీఎంసీల నీటి కొరత ఉందని ఆయన తెలిపారు. నీళ్లను కొనుక్కోలేం కాబట్టి ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తాగునీటికే మొదటి ప్రాధాన్యమివ్వాలని, యాసంగిలో రైతులు వరి సాగును తగ్గించుకోవాలని కోరారు. నీటిని వృథా చేయకుండా ప్రతి చుక్కను ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో కేంద్రం 60:40 నిష్పత్తిలో నిధులతో రాష్ట్రానికి పూర్తి సహాయం అందించాలని సీఎం కోరారు.
xPress24, HYDERABAD, October 16,