xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
ఆంధ్రప్రదేశ్

ఏపి హై కోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిలు బాధ్యతల స్వీకరణ

05-10-2026 14:19
ఏపి హై కోర్టు  శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిలు బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులు జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్,జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ,జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణ రావులు బాధ్యతలు స్వీకరించారు.
xPress24, Amaravati, October 5, అమరావతి, అక్టోబర్ 5: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించారు. జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌ (టీసీడీ శేఖర్‌), జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు సోమవారం శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఫుల్‌ బెంచ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ ఐదుగురు నూతన శాశ్వత న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టులో ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న న్యాయమూర్తులు హాజరై నూతన శాశ్వత న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, సీనియర్‌ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.