xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
తెలంగాణ

ఏరియల్ సర్వే ద్వారా వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

26-09-2026 09:49
ఏరియల్ సర్వే ద్వారా వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌లో జరుగుతున్న గణేష్ శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియను జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జన్నార్, అధికారులతో కలిసి హెలికాప్టర్ నుంచి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ తీరును పరిశీలించారు.
xPress24, Hyderabad, September 25, హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఈ క్రమంలో నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. ఆయనతో పాటు డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జన్నార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక హెలికాప్టర్‌లో కలిసి పర్యటనలో పాల్గొన్నారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. సమన్వయంతో పకడ్బందీ చర్యలు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ భక్తులకు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. నిమజ్జన వేగవంతానికి సహకారం నిమజ్జన ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా గణేష్ ఉత్సవ నిర్వాహకులు తగిన సహకారం అందించాలని కోరారు. అందరి భాగస్వామ్యంతో ఈ వేడుకను విజయవంతంగా ముగించాలని పిలుపునిచ్చారు. బైట్ - పొన్నం ప్రభాకర్, మంత్రి

🎥 వీడియో

ఏరియల్ సర్వే ద్వారా వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

ఏరియల్ సర్వే ద్వారా వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.