ఆంధ్రప్రదేశ్
ఏలూరు జిల్లాలో ‘సాధన’ కార్యక్రమం నిర్వహణ
16-10-2026 14:18
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులకు ప్రత్యేక శిక్షణ.. అల్లర్ల నిరోధక సామగ్రి తనిఖీ
xPress24, Eluru, October 16,
ఏలూరు జిల్లా, అక్టోబర్ 16:
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డివిజన్ డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనలతో కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలో శుక్రవారం ‘సాధన’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. రవి కుమార్ ఆధ్వర్యంలో కైకలూరు రూరల్ ఎస్ఐ రాంబాబు, కలిదిండి ఎస్ఐ పవన్ కుమార్, మండవల్లి ఎస్ఐ రామచంద్రరావు, ముదినేపల్లి ఎస్ఐ టి. సూర్య శ్రీనివాస్తో పాటు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి శారీరక దారుఢ్య కవాతు నిర్వహించి, విధుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండేలా అవసరమైన శిక్షణ అందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అల్లర్ల నియంత్రణకు ఉపయోగించే రయట్ గేర్, లాఠీలు, హెల్మెట్లు, బాడీ ప్రొటెక్టర్ల పనితీరును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాటి నిర్వహణ, పనితీరుకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పాటించాల్సిన చేయాల్సిన, చేయకూడని పనులపై (Do’s and Don’ts) అధికారులు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.