ఆంధ్రప్రదేశ్
ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్ ఔట్ పరేడ్
26-09-2026 14:51
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (ఎస్‌సీటీపీసీ) పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
xPress24, Eluru, September 26,
ఏలూరు, సెప్టెంబర్ 26:
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (ఎస్‌సీటీపీసీ) పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్ల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తదితరులు పాల్గొన్నారు.