xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లా డీఎస్పీ ఆఫీసు చుట్టూ తిరిగినా అందని న్యాయం.. కాంగ్రెస్ రంగప్రవేశంతో కదిలిన యంత్రాంగం!

30-09-2026 15:05
ఏలూరు జిల్లా డీఎస్పీ ఆఫీసు చుట్టూ తిరిగినా అందని న్యాయం.. కాంగ్రెస్ రంగప్రవేశంతో కదిలిన యంత్రాంగం!
​- మూడు రోజుల్లో భూమి పట్టాలు మార్చకపోతే అప్పలరాజుగూడెం పంచాయతీ ముట్టడి: రైతుల హెచ్చరిక ​- బాధితులకు అండగా నిలిచిన పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయ్ భాస్కర్
అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులు, బాధితులకు భద్రత కల్పించాల్సిన పోలీసు శాఖ చేతులెత్తేసిన వైనంపై ప్రజావీక్షణం వెలుగులోకి తెచ్చిన కథనానికి కొనసాగింపుగా ఇప్పుడు రాజకీయ మరియు ప్రజా సంఘాల మద్దతు లభించింది. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ పార్టీ, బాధిత రైతుల పక్షాన నిలిచి తన పోరాట పటిమను చాటుకుంది. ​ స్థానిక నాయకుల ఉదాసీనత.. కాంగ్రెస్ ఆశ్రయించిన రైతులు: అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన రైతులు ఎల్లే నాగేశ్వరరావు, ఎల్లే వీర్రాజు భూమి రికార్డుల మార్పు కోసం అప్పలరాజుగూడెం విలేజ్ సర్వేయర్ బంగారు రాజు లంచం డిమాండ్ చేసి చేస్తున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.జనసేన పార్టీకి చెందిన అప్పలరాజుగూడెం జనసేన నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ అయిన తొమ్మిదెల్లా శ్రీనివాస్ రావు ను రైతులు ఆశ్రయించినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన కరువైంది. దీంతో విసిగిపోయిన బాధితులు పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయ్ భాస్కర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ​రంగంలోకి దిగిన బండి విజయ్ భాస్కర్.. సర్వేయర్‌కు హెచ్చరిక: రైతుల కష్టాలను సానుకూలంగా స్పందించి పరిశీలించిన కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయ్ భాస్కర్... "రైతులకు న్యాయం జరిగే వరకు మీ వెన్నంటే ఉంటానని" భరోసా కల్పించారు. వెంటనే ఆయన నేరుగా విలేజ్ సర్వేయర్ బంగారు రాజుకు ఫోన్ చేసి, "రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?" అని నిలదీశారు. ​కాంగ్రెస్ నాయకుల హెచ్చరికతో ఒక్కసారిగా వణికిపోయిన సర్వేయర్ బంగారు రాజు బాధితులు ఎల్లే వీర్రాజు, ఎల్లే నాగేశ్వరరావులకు సంబంధించిన సొంత భూమి రికార్డులను సరిచేసి, కేవలం మూడు రోజుల్లోగా వారి పేరున పట్టాలు అందేలా చూస్తానని గడువు ఇవ్వడం జరిగింది. ​రైతుల అల్టిమేటం .. మూడు రోజుల్లో న్యాయం అప్పలరాజుగూడెం జరగకపోతే పంచాయతీ ముట్టడి! ఈ పరిణామాలపై స్పందించిన రైతులు మాట్లాడుతూ.. "ఇన్ని రోజులు మేము ఎన్నోసార్లు సంవత్సరాల తరపడి అధికారుల చుట్టూ తిరిగి ఓపిక పట్టాము. ఒకవేళ ఇచ్చిన మూడు రోజుల గడువులో మా సమస్య పరిష్కారం కాకపోతే, అప్పలరాజుగూడెం పంచాయతీ వద్ద రైతులమంతా ఏకమై భారీ ధర్నాతో కార్యాలయాన్ని ముట్టడిస్తాము" అని తీవ్రంగా హెచ్చరించారు. ​అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలపై స్పందించి రైతులకు అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకుడు బండి విజయ్ భాస్కర్ తీరును స్థానిక ప్రజలు, రైతులు అభినందిస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.