xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
క్రీడలు

ఒలింపిక్స్ ఆతిథ్యంలో భారత్ కల నెరవేరే దిశగా మరో కీలక అడుగు

07-10-2026 09:59
ఒలింపిక్స్ ఆతిథ్యంలో భారత్ కల నెరవేరే దిశగా మరో కీలక అడుగు
ఒలింపిక్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ కల నెరవేరే దిశగా మరో కీలక అడుగు పడింది. తాజాగా 2036 ఎడిషన్‌‌కు సంబంధించి భారత్‌తో పాటు ఖతార్‌ రేసులో ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ధ్రువీకరించింది.
xPress24, Hyderabad, October 6, ఒలింపిక్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ కల నెరవేరే దిశగా మరో కీలక అడుగు పడింది. తాజాగా 2036 ఎడిషన్‌‌కు సంబంధించి భారత్‌తో పాటు ఖతార్‌ రేసులో ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ రెండు దేశాలతో పాటు మరో ఐదు దేశాలు కూడా ఆతిథ్యం కోసం పోటీలో ఉన్నట్లు ఐఓసీ వెల్లడించింది. మొత్తం వందకుపైగా సభ్యులు కలిగిన అసోసియేషన్‌ 2029లో ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం భారత్, ఖతార్‌లు ఫేవరెట్‌గా ఉన్నట్లు ఐఓసీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం 2036 ఎడిషన్‌ మాత్రమే కాకుండా.. 2040, 2044 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, జర్మనీ, హంగరీ, తుర్కియే దేశాలు కూడా చర్చలు జరుపుతున్నాయి. 2036 ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్‌ వేయడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉండగా, బిడ్డర్లకు మార్గదర్శనం చేయడానికి ఐఓసీ ప్రత్యేకంగా 30 పేజీల డాక్యుమెంట్‌ను ప్రచురించింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.