తెలంగాణ
ఓటు హక్కు కాలరాస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే: మంత్రి వాకిటి శ్రీహరి
08-10-2026 09:57
ఓటు హక్కును కాలరాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి... ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓట్లను తొలగించారని ఆరోపించారు.
xPress24, MAKATHAL-NARAYANPET, October 8,
ఓటు హక్కును కాలరాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి... ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓట్లను తొలగించారని ఆరోపించారు. మక్తల్ నియోజకవర్గంలో ఏకంగా 70 వేల ఓట్లను తొలగించారని, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్ల తొలగింపుపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని దుయ్యబట్టడమే కాకుండా..... దీనిపై ఎన్నికల సంఘం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల సంఘం తీరును ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని మంత్రి తేల్చిచెప్పారు.