తెలంగాణ
ఓటు హక్కు పరిరక్షణకు దేశవ్యాప్త పోరాటం: సీఎం రేవంత్‌రెడ్డి
08-10-2026 16:05

దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని, ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు, ప్రతిపక్ష నేతలపై అణచివేతకు వ్యతిరేకంగా వీధుల నుండి పార్లమెంట్ వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి, ప్రజల ఉద్యమమని తెలిపారు.
xPress24, HYDERABAD, October 8,