xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
తెలంగాణ

ఓటర్ల జాబితా అక్రమాలపై ‘చలో లోక్‌భవన్’ ర్యాలీ

08-10-2026 16:06
ఓటర్ల జాబితా అక్రమాలపై ‘చలో లోక్‌భవన్’ ర్యాలీ
ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఇండి కూటమి, టీపీసీసీ ఆధ్వర్యంలో ‘చలో లోక్ భవన్’ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సీపీఎం, సీపీఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్‌భవన్‌కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
xPress24, HYDERABAD, October 8,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.