తెలంగాణ
ఓట్ల తొలగింపునకే ‘సర్’ను ఉపయోగిస్తున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
12-10-2026 15:44

ప్రజల ఓట్లు తొలగించేందుకే ‘సర్’ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేడ్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారన్నారు. ఎంతో అధ్యయనం అనంతరం ఓటుహక్కును రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆ ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
xPress24, HYDERABAD, October 12,