తెలంగాణ
కాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు
05-10-2026 15:55

ఈరోజు కాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకటస్వామి పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగారని పేర్కొన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ప్రగతి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు.
xPress24, HYDERABAD, October 5,