xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్కబతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

09-10-2026 09:38
జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
xPress24, KAKINADA, October 8, కాకినాడ జిల్లా, అక్టోబర్ 8: జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, ఎంపీడీవోలు, మై భారత్ వాలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ అమలు తీరు, టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, క్షయ వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియోను ఏ విధంగా నిర్మూలించామో, అదే లక్ష్యంతో క్షయ వ్యాధిని కూడా పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇప్పటివరకు ప్రధానంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో తొలిసారిగా స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలన పూర్తిస్థాయిలో సాధించాలంటే వైద్యశాఖతో పాటు ఇతర శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ప్రతి మండలానికి ఎంపీడీవోను క్లాస్-1 నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. వీరికి సహకరించేందుకు మై భారత్ కార్యక్రమం కింద ఐదుగురు వాలంటీర్లు, ఐదుగురు ఎన్‌సీసీ క్యాడెట్లను ప్రతి మండలంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. వీరందరితో కూడిన ‘జోష్’ బృందాలు క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించడం, టీబీ బాధితులను గుర్తించడం, వారికి తగిన వైద్యం అందేలా చూడడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తాయని కలెక్టర్ వివరించారు. టీబీ బాధితులను ముందుగానే గుర్తించడం మొదటి దశ కాగా, గుర్తించిన వారందరికీ క్రమం తప్పకుండా మందులు అందిస్తూ పూర్తిస్థాయిలో చికిత్స అందించడం రెండో దశ అని తెలిపారు. టీబీ వ్యాధి మరింత విస్తరించకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం మూడో దశగా పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాలు, ఇళ్లలో అధిక సంఖ్యలో ప్రజలు కలిసి నివసించే ప్రాంతాలు, నిర్మాణ రంగం, మైనింగ్ ప్రాంతాలు వంటి హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి ద్వారా లాగిన్‌లను రూపొందించి, ఎంపీడీవోలు వాలంటీర్ల వివరాలను అందులో నమోదు చేస్తారని చెప్పారు. మండల స్థాయిలో నిర్వహించే ర్యాలీలు, వీధి నాటకాలు, ఇతర అవగాహన కార్యక్రమాల వివరాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. గతంలో జిల్లాలో 3 వేలకుపైగా ఉన్న టీబీ కేసులు ప్రస్తుతం 1,600కు తగ్గాయని కలెక్టర్ తెలిపారు. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి కాకినాడ జిల్లాను పూర్తిగా టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంపై రూపొందించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

🎥 వీడియో

కాకినాడ జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.