ఆంధ్రప్రదేశ్
కాకినాడలో భారత్ హబ్ స్కిల్ సెంటర్‌కు శంకుస్థాపన
05-10-2026 14:30

యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో ‘స్కిల్స్, స్టార్టప్స్, భారత్ హబ్ – స్కిల్ సెంటర్’ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు.
xPress24, Kakinada, October 5,
కాకినాడ , 05 అక్టోబర్ 2026 : యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో ‘స్కిల్స్, స్టార్టప్స్, భారత్ హబ్ – స్కిల్ సెంటర్’ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత్ హబ్ స్కిల్ సెంటర్‌కు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తో కలిసి ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ, తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. యువతకు అవసరమైన ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందించడంతో పాటు, వారి స్టార్టప్ ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం, అవకాశాలను కల్పించేలా స్కిల్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.