ఆంధ్రప్రదేశ్
కాకినాడలో సీఐఐ ప్రాంతీయ సదస్సు
12-10-2026 14:25

కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.
xPress24, Kakinada, October 12,
కాకినాడ, అక్టోబర్ 12:
కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ODOP), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఈ ప్రదర్శనల ద్వారా స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.