తెలంగాణ
కాంగ్రెస్ నేతలు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు: రఘునాథ్ వెరబెల్లి
25-09-2026 11:31
మంచిర్యాలలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నేతలు సమస్యలను గాలికొదిలేశారని ఆయన దుయ్యబట్టారు.
xPress24, Mancherial, September 24,
మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు పరాకాష్ఠకు చేరిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా అభివృద్ధిని పక్కనబెట్టి నేతలు ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. మంచిర్యాలలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునాథ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల వైఖరిని చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు సంబంధించిన రూ. 470 కోట్ల అప్పులను బ్యాంకులకు చెల్లించగానే, అందులో తమ వాటా అడగడంతోనే గంజాయి బ్యాచ్ విడిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు. మంచిర్యాలలో గంజాయి బ్యాచ్‌ను పెంచి పోషించిందే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు కేవలం ఫ్లెక్సీల రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్‌లో అనేక సమస్యలు ఉన్నాయని, మున్సిపల్ కార్మికులకు సరిగా జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రఘునాథ్ వెరబెల్లి హెచ్చరించారు.
బైట్: రఘునాథ్ వెరబెల్లి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు