తెలంగాణ
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఆస్తులపై విచారణ జరిపించాలి: ఎంపీ రఘునందన్ రావు
03-10-2026 09:08
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు దొంగలేనని బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
xPress24, Sangareddy, October 2,
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు దొంగలేనని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఆస్తుల విషయమై సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచిన నేపథ్యంలో రఘునందన్ రావు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ వారు ఇద్దరూ కలిసి తెలంగాణ హైకోర్టుకు లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు.
నా ఆస్తులపై విచారణకూ సిద్ధం
ఒకవేళ వారు స్పందించకపోతే తానే స్వయంగా హైకోర్టుకు లేఖ రాస్తానని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అవసరమైతే తాము ముగ్గురం కలిసి సిట్టింగ్ జడ్జి విచారణ కోసం విజ్ఞప్తి చేద్దామని, తన ఆస్తులపై కూడా సమగ్ర విచారణ జరిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాజకీయ నాయకుల ఆస్తులపై వస్తున్న ఆరోపణలకు తెరదించేందుకు ఈ విచారణ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
బైట్ - రఘునందన్ రావు, బీజేపీ మెదక్ ఎంపీ