తెలంగాణ
కాంగ్రెస్ హామీల అమలుపై తలసాని విమర్శలు
28-09-2026 16:47

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తులం బంగారం హామీ ఇచ్చి మూడేళ్లయినా ఒక్కరికీ ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ పెంపు అమలు కాలేదని అన్నారు.
xPress24, Hyderabad, September 28,