తెలంగాణ
కాంగ్రెస్‌పై రామచందర్‌రావు విమర్శలు
30-09-2026 14:41

కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ, మతాలు, కులాల పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల తన ప్రసంగంలో హిందూ దేవతలను అవమానపరిచేవిధంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవించడమే హిందువుల ముఖ్య ఉద్దేశ్యమని, దానిని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. సర్ విషయంలో కాంగ్రెస్ యాంటీ ఇండియా ఆలోచనతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఇటీవల పసిపిల్లలు చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ.. ఓటమికి మాత్రం ఈవీఎంలు, సర్ ల పేరిట కారణాలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు.
xPress24, HYDERABAD, September 29,