ఆంధ్రప్రదేశ్
కొటిపల్లి–నరసాపూర్ కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు అదనపు నిధులు
02-10-2026 09:42

కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల అయిన కొటిపల్లి–నరసాపూర్ కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట్ర వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట్ర వాటా కింద పరిగణనలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు.
xPress24, Amaravathi, October 2,