ఆంధ్రప్రదేశ్
కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ప్రారంభం
13-10-2026 14:03
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
xPress24, Srikakulam, October 13,
కోటబొమ్మాళి, అక్టోబర్ 13:
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి శ్రీ కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.