xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
తెలంగాణ

కడియం శ్రీహరిని బెదిరించారన్న ఆరోపణలు నిరాధారకం: కౌశిక్ రెడ్డి

08-10-2026 09:41
అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బెదిరించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ 16 పేజీల నివేదికను కమిటీకి సమర్పించారు.
xPress24, Hyderabad, October 7, అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బెదిరించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి స్పష్టమైన వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కమిటీకి సమర్పించిన పదహారు పేజీల నివేదికలో ఆయన తెలిపారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు తప్పుగా అర్థం చేసుకుని తనపై అసత్య అభియోగాలు మోపారని కౌశిక్ రెడ్డి వివరించారు. ఈ క్రమంలో తన హావభావాలను అసలు సందర్భం నుంచి వేరు చేసి చూపించారని పేర్కొన్నారు. సభలో జరిగిన వాగ్వాదం, పరస్పర ఆరోపణలు, నినాదాల మధ్యే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన వివరణలో స్పష్టం చేశారు. పూర్తి వీడియోను పరిశీలించాలని విజ్ఞప్తి అసెంబ్లీ ఘటనకు సంబంధించి ఎథిక్స్ కమిటీకి అందించిన వీడియో క్లిప్పింగ్ అసంపూర్ణంగా ఉందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి వీడియోను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన కోరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించకుండా కేవలం పాక్షిక వీడియో ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎథిక్స్ కమిటీని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదితో కలిసి వాదనలు వినిపించే అవకాశం తన వాదనలను మరింత స్పష్టంగా వినిపించేందుకు తనతో పాటు తన అడ్వకేట్‌ను కూడా ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిపించి వాదనలు వినాలని కౌశిక్ రెడ్డి కోరారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించిన నేపథ్యంలో కమిటీ ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిబంధనల ప్రకారం పూర్తి విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

🎥 వీడియో

కడియం శ్రీహరిని బెదిరించారన్న ఆరోపణలు నిరాధారకం: కౌశిక్ రెడ్డి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.