తెలంగాణ
కుందన్‌పల్లిలో 7,200 గజాల స్థలం ఆక్రమణల తొలగింపు
30-09-2026 15:54

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7వేల 200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా, మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టి పోసి కబ్జా చేయకుండా, ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటరు మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
xPress24, HYDERABAD, September 30,