ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రులకు విజయవాడ దసరా ఉత్సవాల ఆహ్వానం
06-10-2026 14:26
విజయవాడలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు.
xPress24, Vijayawada, October 6,
విజయవాడ:
విజయవాడలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషీలకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), హరీష్ బాలయోగి, విజయవాడ ఉత్సవ్ కమిటీ ప్రతినిధి నరసింహారావు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులను విజయవాడలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.