జాతీయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వేగవంతమైన అభివృద్ధి: కోమటిరెడ్డి
05-10-2026 15:53

గుజరాత్‌లోని ఎక్తా నగర్‌లో జరుగుతున్న 'చింతన్ శివిర్-2026' లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ప్రశంసిస్తూ, భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే జాతీయ రహదారులు, రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 5,