తెలంగాణ
కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా చర్యలు
03-10-2026 09:38

రాష్ట్రవ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకు ముఖ్యమంత్రి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తిచేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని కేలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
xPress24, Hyderabad, October 3,