xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
జాతీయం

కేంద్ర‌మంత్రి భూపేంద్ర యాద‌వ్‌

26-09-2026 10:13
కేంద్ర‌మంత్రి భూపేంద్ర యాద‌వ్‌
సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్ట్ వర్క్‌షాప్‌ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు.. అటవీ అగ్నిప్రమాదాల నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక, క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగ‌ల‌ద‌ని అన్నారు. కార్యాచరణ, పరిపాలనా కోణాల నుండి క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది సామర్థ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరం కూడా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆచరణాత్మక శిక్షణ కోసం శిక్షణా సంస్థలను బలోపేతం చేయడం, సార్క్ స‌హా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నాయని చెప్పారు. అటవీ రంగంలో భారత్, జపాన్ దేశాల‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సహకారంలో ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన మైలురాయి అని భూపేంద్ర యాద‌వ్ తెలియ‌జేశారు.
xPress24, Krishna District, September 25,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.