ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి
17-10-2026 10:44

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా నిన్న దర్శించుకున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడారు.
xPress24, Vijayawada, October 17,