అంతర్జాతీయం
కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ సమావేశం
28-09-2026 10:34

న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (యుఎన్‌జిఎ) వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా సాగిందని, ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పని చేస్తున్నామని జైశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్యా రంగాల్లో ఇరుదేశాల ఉన్నత స్థాయి చర్చలను త్వరలోనే కీలక ఒప్పందాలుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబర్‌లో కెనడాలో పర్యటించే అవకాశం ఉందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ యూఎన్ వేదికగా వెల్లడించారు. భారత్‌తో వాణిజ్య చర్చల్లో మంచి పురోగతి సాధిస్తున్నామని ఆయన తెలిపారు.
xPress24, Krishna District, September 27,