xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
తెలంగాణ

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం

05-10-2026 13:10
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌ వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది.
xPress24, Hyderabad, October 5, కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌ వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేయనుంది. కొత్త ప్లానింగ్ మార్పులతో జీహెచ్ఎంసీకి రూ.400 కోట్లు ఆదా అవనుంది. అవసరాన్ని బట్టి ఫ్లై ఓవర్లు, అండర్పాస్‌లు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మీడియాకు వెల్లడించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ సింగల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. అందుకే సింగల్ వే విధానాన్ని శాశ్వతంగా ఉంచబోతున్నామని ప్రకటించారు. ప్లానింగ్‌లో మార్పులు చేసి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. నాగార్జున సర్కిల్ నుంచి చెక్‌పోస్ట్ వరకు స్టీల్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నామని.. ఏడాదిలో పూర్తి అయిపోతుందని తెలిపారు. కొత్త ప్లాన్ వలన ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పారు. బ్రిడ్జ్ పనులు, అండర్పాస్ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయన్నారు. కొన్ని కోర్టు కేసులు వల్ల ప్లాన్ కూడా మార్చామన్నారు. ట్రాఫిక్‌ను శాశ్వతంగా తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.