తెలంగాణ
కరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులు
02-10-2026 17:05

అహింసను ఆయుధంగా...సత్యమే మార్గంగా కోట్లాదిమంది భారతీయుల్లో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించిన మహనీయులు మహాత్మాగాంధీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ గాంధీ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్పూర్తి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో పోరాటాలు దేశానికి ఆదర్శం అని బండి సంజయ్ అన్నారు.
xPress24, HYDERABAD, October 2,