ఆంధ్రప్రదేశ్
కర్నూలు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
25-09-2026 14:53

కర్నూలు జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం సెప్టెంబర్ 24, 2026తో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరిని నియమించింది.
xPress24, Kurnool, September 25,
కర్నూలు, సెప్టెంబర్ 25:
కర్నూలు జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం సెప్టెంబర్ 24, 2026తో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరిని నియమించింది. దీంతో శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిపాలనా కార్యకలాపాలపై కలెక్టర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన తాగునీటి సదుపాయాల కల్పనతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు.