xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో ఘనంగా హెరిటేజ్ వాక్

25-09-2026 14:54
కర్నూలులో ఘనంగా హెరిటేజ్ వాక్
కర్నూలు నగర చారిత్రక వైభవం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలు, విద్యార్థులు, యువత, పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు వారసత్వ కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
xPress24, Kurnool, September 25, కర్నూలు, సెప్టెంబర్ 25: కర్నూలు నగర చారిత్రక వైభవం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలు, విద్యార్థులు, యువత, పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు వారసత్వ కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి తిరుమల నాయుడు మాట్లాడుతూ.. కర్నూలు నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన కొండారెడ్డి బురుజు చారిత్రక ప్రాధాన్యత కలిగిన వారసత్వ కట్టడాల్లో ఒకటని తెలిపారు. హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్న వారికి కొండారెడ్డి బురుజు నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యం, కర్నూలు ప్రాంత చరిత్రతో ముడిపడిన పలు విశేషాలను వివరించినట్లు చెప్పారు. అలాగే, శనివారం ఉదయం గార్గేయపురం వద్ద ఉన్న నగరవనంలో “ప్రకృతి ఒడిలో ప్రాతఃకాలపు నడక” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.