ఆంధ్రప్రదేశ్
కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు
02-10-2026 15:44

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్‌లో అప్‌లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్‌ఓలు ఆన్‌లైన్‌లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరఫున కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు.
xPress24, Amaravathi, October 2,