తెలంగాణ
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హరీశ్‌రావు విమర్శలు
02-10-2026 17:00

బీఆర్ఎస్ హయాంలో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచి, బాల్యవివాహాలను అడ్డుకున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈ పథకాలు ప్రారంభించి నేటితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలను మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రెండు లక్షల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి, హామీ ఇచ్చిన విధంగా తులం బంగారాన్ని వెంటనే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
xPress24, HYDERABAD, October 2,