జాతీయం
కిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
23-09-2026 17:33

న్యూఢిల్లీలోని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాదపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన స్వామీజీ.. భారతీయ సంస్కృతి మూలాలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పిలుపునిచ్చారు.
xPress24, HYDERABAD, September 23,