ఆంధ్రప్రదేశ్
క్షయ వ్యాధి నిర్మూలన
09-10-2026 14:42

క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ సూచించారు.
xPress24, Amaravati, October 9,
అమరావతి, 09 అక్టోబర్ 2026 : క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ సూచించారు.ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ -జోష్ జాతీయ కార్యక్రమంలో భాగంగా, గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు.క్షయ వ్యాధిపై అవగాహన పెంచే జోష్ బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్‌సీసీ క్యాడెట్లు భాగస్వాములవుతారని తెలిపారు.