xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్

కృష్ణా నదిలో విలాస విహారం.. త్వరలో లగ్జరీ హౌస్‌బోట్‌, డిన్నర్‌ క్రూజ్

29-09-2026 16:57
కృష్ణా నదిలో విలాస విహారం.. త్వరలో లగ్జరీ హౌస్‌బోట్‌, డిన్నర్‌ క్రూజ్
కృష్ణా నదిలో మరో కొత్త పర్యాటక ఆకర్షణ త్వరలో అందుబాటులోకి రానుంది. నదిలో ప్రయాణించడమే కాకుండా.. పడవలోనే హోటల్‌ తరహా సౌకర్యాలు, భోజనం, వినోదం, పార్టీలు, ప్రత్యేక వేడుకలు నిర్వహించుకునేలా లగ్జరీ హౌస్‌బోట్‌, పార్టీ, డిన్నర్‌ క్రూజ్‌లు రానున్నాయి. ఇందుకు ఓ ప్రైవేట్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బోట్ల నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నాలుగైదు నెలల్లో ఈ బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కృష్ణా నదిలో కేరళ తరహా హౌస్‌బోట్‌ నిర్వహిస్తున్నారు.రివర్ క్రూజ్ బుక్ చేయండి
కృష్ణా నదిలో మరో కొత్త పర్యాటక ఆకర్షణ త్వరలో అందుబాటులోకి రానుంది. నదిలో ప్రయాణించడమే కాకుండా.. పడవలోనే హోటల్‌ తరహా సౌకర్యాలు, భోజనం, వినోదం, పార్టీలు, ప్రత్యేక వేడుకలు నిర్వహించుకునేలా లగ్జరీ హౌస్‌బోట్‌, పార్టీ, డిన్నర్‌ క్రూజ్‌లు రానున్నాయి. ఇందుకు ఓ ప్రైవేట్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బోట్ల నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నాలుగైదు నెలల్లో ఈ బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కృష్ణా నదిలో కేరళ తరహా హౌస్‌బోట్‌ నిర్వహిస్తున్నారు.రివర్ క్రూజ్ బుక్ చేయండి లగ్జరీ హౌస్‌బోట్‌లో ప్రత్యేక సౌకర్యాలు తాజాగా మరో రెండు భారీ బోట్లు అందుబాటులోకి రానుండటంతో నదీ పర్యాటకానికి మరింత ఆదరణ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.కృష్ణా నదిలో ప్రవేశపెట్టనున్న లగ్జరీ హౌస్‌బోట్‌లో ఐదు పడక గదులు ఉంటాయి. అలాగే ఒకేసారి 100 మంది భోజనం చేసేందుకు వీలుగా ఏసీ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు.ప్రస్తుతం కేరళ, కశ్మీర్‌ ప్రాంతాల్లో లగ్జరీ హౌస్‌బోట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రాత్రి బస చేస్తూ నదిలో విహరించే అవకాశం పర్యాటకులకు లభిస్తోంది.అదే తరహాలో కృష్ణా నదిపైనా పర్యాటకులకు రాత్రి బస, నదీ విహారం వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.దీంతో నదిలో ప్రయాణంతోపాటు ప్రత్యేక అనుభూతిని పొందే అవకాశం పర్యాటకులకు లభించనుంది. పార్టీ, డిన్నర్‌ క్రూజ్‌ మరింత భారీగా.. విజయవాడలో పార్టీ, డిన్నర్‌ క్రూజ్‌ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రూజ్‌ లగ్జరీ హౌస్‌బోట్‌ కంటే పెద్దదిగా ఉంటుంది.దుబాయ్‌, లండన్‌, గోవా వంటి ప్రాంతాల్లో పార్టీ, డిన్నర్‌ క్రూజ్‌లను ప్రస్తుతం పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అదే తరహాలో కృష్ణా నదిలోనూ క్రూజ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ క్రూజ్‌లో ఒకేసారి 200 మంది పార్టీ, డిన్నర్‌ చేసుకునేలా రెండు ఏసీ డెక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు, కుటుంబ వేడుకలు, కార్పొరేట్‌ సమావేశాలు నిర్వహించుకునేలా క్రూజ్‌ను రూపొందిస్తున్నారు.దీంతో సాధారణ నదీ విహారంతోపాటు వివిధ రకాల వేడుకలకు కూడా ఇది వేదికగా మారనుంది. ఇప్పటికే హౌస్‌బోట్‌ సేవలు విజయవాడలో కృష్ణా నదిలో ఇప్పటికే ఒక హౌస్‌బోట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో బెడ్‌రూం, లివింగ్‌ ఏరియాతోపాటు హోటల్‌ తరహా సౌకర్యాలు ఉన్నాయి.దీనిని తేలియాడే రెస్టారెంట్‌గా కూడా వినియోగిస్తున్నారు. ప్రైవేట్‌ పార్టీలు, ఇతర ప్రత్యేక వేడుకలు నిర్వహించుకునేలా ఈ హౌస్‌బోట్‌ను డిజైన్‌ చేశారు. భవానీ ఐలాండ్‌, పవిత్ర సంగమంతో అనుసంధానం విజయవాడలో ఇప్పటికే భవానీ ఐలాండ్‌, పవిత్ర సంగమం వంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.వీటికి కృష్ణా నదిలో అందుబాటులోకి రానున్న హౌస్‌బోట్‌, పార్టీ, డిన్నర్‌ క్రూజ్‌లను అనుసంధానించడం ద్వారా పర్యాటకులకు మరింత విస్తృతమైన అనుభవాన్ని అందించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.భోజనం, నదీ విహారం, బస, వినోదం వంటి సౌకర్యాలన్నింటినీ కలిపి ప్యాకేజీగా రూపొందించే అవకాశం ఉంది. దీంతో విజయవాడలో కృష్ణా నదీ పర్యాటకానికి కొత్త రూపు రానుందని భావిస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.