తెలంగాణ
ఖమ్మం రైల్వే స్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం
02-10-2026 16:56

స్వచ్ఛతా-హీ-సేవా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఖమ్మం రైల్వే స్టేషన్లో స్వచ్ఛభారత్ నిర్వహించారు. స్టేషన్ మేనేజర్ ఎం. రాజేంద్ర ఆధ్వర్యంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు ప్రదర్శన చేపట్టారు. ప్రాంగణంలో చెత్తచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఖమ్మం జిల్లా మధిరలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
xPress24, HYDERABAD, October 2,