తెలంగాణ
ఖమ్మం సమీపంలో రూ.100 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
12-10-2026 15:47

ఖమ్మం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో రూ.100 కోట్లతో తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి ప్రవచనాలు అందించగా, భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.
xPress24, HYDERABAD, October 12,