తెలంగాణ
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగింపు – నిమజ్జనానికి ఏర్పాట్లు
25-09-2026 15:21

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 69 అడుగుల భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకోవడంతో, అధికారులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తోంది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు బారికేడ్లను దాటుకుని ముందడుగు వేస్తున్నారు.
xPress24, HYDERABAD, September 25,