xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

03-10-2026 17:03
ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని విజయనగరం సంయుక్త కలెక్టర్‌ ఎస్. సేధు మాధవన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.
xPress24, Vizianagaram, October 3, విజయనగరం, అక్టోబర్‌ 3: ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని విజయనగరం సంయుక్త కలెక్టర్‌ ఎస్. సేధు మాధవన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం క్లస్టరింగ్‌ అనంతరం 261 రైతు సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌కేలు) ప్రతిపాదించినట్లు అధికారులు వివరించారు. గత సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసిన 368 ఆర్‌ఎస్‌కేలకు గాను 366 కేంద్రాల స్వీయ ప్రకటనల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వీటిలో 183 కేంద్రాల తనిఖీలు పూర్తికాగా, మరో 183 కేంద్రాల తనిఖీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని 171 రైస్‌మిల్లులకు గాను 152 మిల్లుల స్వీయ ప్రకటనలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇప్పటివరకు 114 మిల్లుల తనిఖీలు పూర్తికాగా, మరో 38 మిల్లుల తనిఖీలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మిగిలిన తనిఖీలను త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియలో వినియోగించే వాహనాల రిజిస్ట్రేషన్‌ను కూడా వేగవంతం చేసి, సీజన్‌ ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.