xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
తెలంగాణ

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్​ గణనాథుడు

25-09-2026 17:47
అశేష భక్త వాహిని జయజయధ్వానాల మధ్య ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు ట్యాంక్ బండ్ వద్ద గంగమ్మ ఒడికి చేరడంతో హైదరాబాద్ నగరం జనసంద్రంగా మారింది.
xPress24, Hyderabad, September 25, అశేష భక్తజనావళి కోలాహలం మధ్య ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. 11 రోజుల పాటు భక్తుల నుంచి ధూపదీప నైవేద్యాలందుకున్న ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఈ పవిత్ర క్రతువును వీక్షించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో హైదరాబాద్ నగరం జనసంద్రంగా మారింది. తొలుత బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బడా గణేశ్ పైకి చేరడం ఆలస్యమైంది. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర, క్రేన్ సమస్య కారణంగా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఘనంగా శోభాయాత్ర సాగనంపు అనంతరం బడా గణేశ్ శోభాయాత్ర ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. సంప్రదాయ మేళతాళాలు, భక్తుల ఉత్సాహం నడుమ శోభాయాత్ర ట్యాంక్‌బండ్ క్రేన్ 4 వద్దకు చేరుకుంది. భక్తులు గణనాథుడిపైకి పుష్పాలు చల్లుతూ, డోలు వాయిస్తూ శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. దారి పొడవునా గణేశుడిని కడసారి చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి గణేశుడు చేరుకున్నాడు. ఈ నిమజ్జన వేడుకలతో నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. భారీ భద్రతా వలయంలో హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నగరమంతా భారీ భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. 20 వేల మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. శోభాయాత్రను క్షణక్షణం పర్యవేక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

🎥 వీడియో

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్​ గణనాథుడు

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్​ గణనాథుడు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.