ఆంధ్రప్రదేశ్
గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం
09-10-2026 14:39

గుడ్డు చౌకైన, నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
xPress24, Amaravati, October 9,
అమరావతి, 09 అక్టోబర్ 2026 : గుడ్డు చౌకైన, నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పౌల్ట్రీ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, రంగాన్ని ఆధునికీకరించేందుకు పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29 ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.ప్రజల పోషక భద్రతతో పాటు స్థానిక గుడ్ల వినియోగం, ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.