తెలంగాణ
గాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
02-10-2026 17:04

మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు కొనియాడారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్క పౌరుడూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పించారు. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అందరి కృషిలోనే ఆరోగ్యకరమైన భారత దేశం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 2,