జాతీయం
గాంధీ జయంతి ఈ రోజు
02-10-2026 09:41

సత్యాగ్రహం, అహింసా, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ... భారత స్వాతంత్య్ర పోరాటాన్ని శాంతియుతంగా నడిపించి... యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే... మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని "అంతర్జాతీయ అహింసా దినోత్సవం" గా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా దేశ వ్యాప్తంగా ఈ రోజు జరుపుకుంటున్నారు.
xPress24, Amaravathi, October 2,